హుబే ప్రావిన్సులోని హాంకౌ రైల్వేస్టేషను నుంచి 9 వారాల లాక్ డౌన్ తర్వాత మొట్టమొదటిసారి బుధవారం బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఒక్కో బస్సులో ఓ డ్రైవరుతోపాటు ప్రయాణికుల ఆరోగ్యం గురించి పరీక్షించేందుకు ఓ సేఫ్టీ సూపర్ వైజర్ ను నియమించారు. స్మార్ట్ ఫోన్ వినియోగించని ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేయాలంటే హెల్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని వూచాంగ్ రైల్వేస్టేషను నుంచి నడిపే బస్సు సేఫ్టీ సూపర్ వైజర్ జో జింజింగ్ చెప్పారు.
చైనాలో కరోనా బారిన పడి విలవిల్లాడిన వూహాన్ నగరంలో జనవరి 23 నుంచి బస్సులు, విమానాలు, రైళ్లల సర్వీసులను రద్దు చేశారు. ఒకవైపు కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ప్రపంచంలో పలు దేశాలు లాక్ డౌన్ విధిస్తుండగా, మరో వైపు కరోనా వైరస్ కు కేంద్ర స్థానమైన వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొని బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.