సాధారణంగా పాములు కుబుసం (చర్మాన్ని) విడుస్తుంటాయి. కానీ, అమెరికాకు చెందిన ఆరేళ్ళ చిన్నారి పాములా ప్రతి పక్షం రోజులకు ఒకసారి చర్మాన్ని కుబుసంలా విడుస్తోంది. ఇది వైద్యులకే ఓ సవాల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
పైగా, చిన్నారి చర్మ గ్రంథులు మూసుకుపోవడంతో ఆమెకు చెమట పట్టడం లేదు. ఇది మరింత ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉండడంతో ఆమె తల్లిదండ్రులు మేగాన్, టైసన్‌లు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. నిరంతరం కుమార్తె శరీరానికి లోషన్లు రాస్తూ పొడిబారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ చిన్నారి చర్మం పొడిబారితే అది పగిలిపోయి రక్త స్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.