సయీద్‌ను ఉరితీస్తారా? లేదా? పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

శుక్రవారం, 19 జనవరి 2018 (11:36 IST)
పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరో హెచ్చరిక చేసింది. ఇప్పటికే ఉగ్రవాదం నిర్మూలన కోసం అందిస్తూ వచ్చిన నిధులను అమెరికా నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్ ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అల్టిమేటం జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిన హఫీజ్ సయీద్‌ను చట్టం ముందు నిలబెట్టి ఉరితీయాల్సిందేనని అమెరికా వ్యాఖ్యానించింది. 
 
హఫీజ్‌పై ఎలాంటి కేసూ తమ దేశంలో నమోదు కాలేదని, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం లేదని పాక్ ప్రధాని షాహిద్ కఖాన్ అబ్బాసీ వ్యాఖ్యానించిన 24 గంటల తర్వాత అమెరికా తీవ్రంగా మండిపడుతూ, పాక్‌కు ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. హఫీజ్ సయీద్ ఉగ్రవాదేనని, గతంలో తమకు హామీ ఇచ్చినట్టుగా ఆయన్ను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల్సిందేనని యూఎస్ ప్రతినిధి హెదర్ న్యువార్ట్ వ్యాఖ్యానించారు. 
 
"యూఎన్ఎస్సీ 1267 ప్రకారం హఫీజ్ ఉగ్రవాది. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన లష్కరే తోయిబాకు అధినేత. ఎల్ఈటీని విదేశీ ఉగ్ర సంస్థగా మేము గుర్తించాం. ఎన్నో దేశాలు కూడా గుర్తించాయి. చట్టప్రకారం అతన్ని శిక్షించాల్సిందే" అని న్యువార్ట్ మీడియాకు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు