బ్రెజిల్ దేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. ముఖ్యంగా రియో డి జెనీరో రాష్ట్రంలో ఈ వర్షాలు, వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.