మహిళా ఖైదీలను చూడగానే కామం తన్నుకొచ్చింది.. కాంగో జైలులో తిరుగుబాటుదారుల అకృత్యాలు (Video)

ఠాగూర్

గురువారం, 6 ఫిబ్రవరి 2025 (15:15 IST)
సెంట్రల్ ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తిరుగుబాటుదారుల అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇటీవల ఆ దేశంలోని ముంజెంజ్ జైలులోకి చొరబడిన ఈ తిరుగుబాటుదారులు.. తమ వర్గానికి చెందిన వారిని విడిపించుకున్నారు. ఈ క్రమంలో వారికి ఆ జైలులోని మహిళా ఖైదీలు కంటపడ్డారు. అంతే... వారిలో కామం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. కంటికి కంపించిన మహిళా ఖైదీలపై అత్యాచారానికి తెగబడ్డారు. అంతటితో వారి కసి తీరలేదు. వెళుతూ వెళుతూ అనేక మంది మహిళా ఖైదీలను ఓ గదిలో నిర్బంధించి నిప్పంటించారు. దీంతో వంద మందికిపైగా మహిళా ఖైదీలు మంటల్లో కాలిపోయినట్టు సమాచారం. గత నెల 27వ తేదీన ఈ దారుణం జరిగింది. జైలుకు నిప్పుపెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
గతవారం రువాండా మద్దతు ఉన్న ఎం23 తిరుగుబాటుదారులు కాంగో నగరంలోకి తుపాకులు చేతబట్టి ప్రవేశించి, నగర వాసులను భయభ్రాంతులకు గురిచేశారు. జనవరి 27వ తేదీన గోమాలోకి చొచ్చుకునివచ్చారు. తిరుగుబాటుదారులు ముంజెంజ్ జైలుపై దాడిచేశారు. తమ వర్గం వారిని విడిపించారు. 
 
ఈ తిరుగుబాటుదారులను చూసిన పురుష ఖైదీలు వారి నుంచి తప్పించుకుని పారిపోయారు. అయితే, మహిళా ఖైదీలు మాత్రం తమ ప్రాణాలు కాపాడుకునేందుల్లోనే కనిపించకుండా దాక్కున్నారు. ఈ క్రమంలో తిరుగుబాటుదారుల కంటికి కనిపించిన మహిళా ఖైదీలను పట్టుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని బంధించి కొన్ని గదులకు నిప్పంటించారు. దీంతో వందలాది మంది మహిళా ఖైదీలు సజీవదహనమయ్యారు. 
 
తిరుగుబాటుదారులు వెళుతూ వెళుతూ జైలుకు నిప్పుపెట్టారు. ఆ జైలు నుంచి పొగలు రావడం, ఖైదీలు తప్పించుకుని పారిపోతుండటం, వందలాది కాలిన మృతదేహాలను రెడ్ క్రాస్ సిబ్బంది వాహనాల్లో తరలిస్తున్న దృశ్యాలు, వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి బృందం బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. 


 

???????? Goma : Évasion à la prison de Munzenze pic.twitter.com/TXzNfvC8hu

— The Voice Of Congo (@VoiceOfCongo) January 27, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు