ఇర్మా బీభత్సం.. బర్ముడా దీవిలో భవనాలు నేలమట్టం...

గురువారం, 7 సెప్టెంబరు 2017 (09:11 IST)
కరేబియన్ దీవులను హరికేన్ ఇర్మా అతలాకుతలం చేస్తోంది. ఇర్మా తుఫాను ధాటికి బర్ముడాలోని 90 శాతం భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కరేబియన్ దీవుల్లోని అనేక చిన్న దీవులు చుగురుటాకుల్లా వణికిపోతున్నాయి. పైపెచ్చు.. ఈ హరికేన్ ఫ్లోరిడా వైపు కదులుతుండటంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో ముందస్తు సహాయక చర్చలను చేపడుతోంది. 
 
కరేబియన్ సముద్ర జలాల్లో ఉత్పన్నమైన ఈ హరికేన్ ఇర్మా.. గడచిన 24 గంటల వ్యవధిలో ఆ దీవుల్లో బీభత్సం సృష్టించింది. ఇపుడు అమెరికాను అతలాకుతలం చేస్తోంది. పెనుగాలులు, అతి భారీ వర్షాలతో 'ఇర్మా' విరుచుకుపడుతుండగా, ఫ్లోరిడాతోపాటు చిన్నపాటి దీవులు చిగురుటాకులా వణికిపోయాయి. 
 
ఇప్పటికే హార్వే తుఫాను నష్టం నుంచి తేరుకోని అమెరికాను ఇప్పుడు ఇర్మా తుఫాతో బెంబేలెత్తిపోతోంది. తొలుత ఆంటిగ్వా, బార్బుడాలపై ప్రతాపం చూపిన ఇర్మా, సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని 95 శాతం మేరకు ధ్వంసం చేసి, ఆరుగురి ప్రాణాలను బలిగొని ఫ్లోరిడా వైపు కదిలింది. 
 
గంటకు 295 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తుండగా భారీ ఆస్తినష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. తుఫాను బీభత్సంతో విద్యుత్, సమాచార వ్యవస్థలు కుప్పకూలాయి. వర్జిన్ ఐలాండ్స్, పొటొరికోలోనూ ఇర్మా పెను ప్రభావాన్ని చూపింది. ఇర్మా ప్రయాణించే మార్గాల్లోని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 

 

#Irma has now generated more Accumulated Cyclone Energy during her lifetime than did Hurricane Katrina (2005). pic.twitter.com/Vl8D3qpwAX

— Philip Klotzbach (@philklotzbach) September 5, 2017

వెబ్దునియా పై చదవండి