అమెరికాలో హైదరాబాద్ యువతిపై అత్యాచారం.. హత్య.. దారుణంగా..?

మంగళవారం, 26 నవంబరు 2019 (11:39 IST)
దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావివరుసలు, వయోబేధాలు లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. దేశంలోనే మహిళలపై రక్షణ కరువైందనుకుంటే.. విదేశాల్లోనూ భారతీయ యువతులకు భద్రత లేకుండా పోయింది. అమెరికాలో హైదరాబాద్ యువ‌తిపై దారుణం జరిగింది. పై చదువుల కోసం దేశం కాని దేశం వెళ్లిన ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు కొందరు దుండగులు. 
 
వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌కు చెందిన రూత్ జార్జ్(19) అనే యువతి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో చదువుతోంది. అయితే.. శుక్రవారం నుంచి ఆమె అందుబాటులోకి రావడం లేదని ఆమె తల్లిదండ్రులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆచూకీ కోసం సిబ్బంది గాలించగా.. యూనివర్సిటీ గ్యారేజీలో ఆమె మృతదేహం కనిపించింది.
 
పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించగా ఈ నెల 22న ఆమెను దారుణంగా అత్యాచారానికి గురైందని.. ఆపై హత్య జరిగిందని తేలింది. ఈ కేసులో ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని డోనాల్డ్ తుర్‌మాన్(26)గా పోలీసులు గుర్తించారు. అతడు యూనివర్సిటీకి చెందినవాడు కాదని, ఇంతకుముందే అతడిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు