అయితే, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రమాదకారి అని... దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) హెచ్చరించింది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
మరోవైపు, ఈ ఔషధ నిల్వలు భారత్ వద్ద ఎక్కవగా ఉండటంతో... ఎన్నో దేశాలు వీటిని సరఫరా చేయాల్సిందిగా మన దేశాన్ని కోరాయి. సాయం కోరిన అన్ని దేశాలకు భారత్ ఈ డ్రగ్ ను సరఫరా చేసింది. తద్వారా ప్రపంచ దేశాలకు స్నేహ హస్తాన్ని అందించింది.