చైనా బుద్ధి మారదా? సముద్రంపై పట్టుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నం

శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (15:26 IST)
South China Sea
కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు విలవిల్లాడుతుంటే చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రంపై పట్టుసాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. కరోనా వైరస్ పుట్టుకకు కేంద్రమైన చైనా.. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌ మలేషియా, బ్రూనైతో ఉద్రిక్తతలకు కారణమైన ప్రాంతంలో డ్రాగన్‌ దేశం పట్టు పెంచుకుంటోందని పాంపియో చెప్పారు. 
 
వివాదంలో ఉన్న ప్రాంతంలో మిలటరీ బలగాలు, యుద్ధ నౌకలను మోహరించి చైనా పొరుగు దేశాలను భయపెట్టే యత్నం చేస్తోందని విమర్శించారు. తద్వారా చమురు, సహజయవాయువు ప్రాజెక్టుల అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందన్నారు. పాంపియో ఆరోపణల నేపథ్యంలో యూఎస్‌ యుద్ధనౌక దక్షిణ చైనా సముద్రంలోని తైవాన్‌ జలసంధి గుండా నిఘా పెట్టింది. మరోవైపు దక్షిణ చైనా సముద్రం మొత్తాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న దీవులు, దిబ్బల లెక్క తీస్తున్నామని చైనా తమ చర్యను సమర్థించుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు