పాము అంటేనే ఆమడ దూరం పారిపోతుంటారు జనం. చాలామంది పాము పేరు చెబితేనే భయంతో వణికిపోతారు. అలాంటిది.. ఆ పాము మన ఇంట్లోకి దూరితే.. ఇలాంటి సంఘటనే ఓ వ్యక్తికి ఎదురైంది. అది కూడా ఆ పాము టాయ్‌లెట్‌లో దూరింది. అది చూసుకోకుండా.. ఆయన టాయ్‌లెట్‌లో కూర్చోగా.. అది కాస్త ఆయనను కాటు వేసింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.
ఆ తర్వాత జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తన ఇంటిపక్కన ఉండే 24 ఏళ్ల యువకుడు కొండ చిలువల్ని, పాములను పెంచుతున్నాడని గుర్తించారు.
అతని అపార్ట్ మెంట్లో దాదాపు 11 రకాల విషపూరిత పాములు ఉన్నాయని పోలీసులు కనుగొన్నారు. కొండ చిలువ కాటుతో ప్రాణానికి పెద్దగా ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు. ఆ వృద్ధుడిని, కాటు వేసిన కొండ చిలువ కొన్ని రోజుల ముందు తప్పిపోయిందని ఆ యువకుడు విచారణలో తెలిపాడు.