లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ చివరకు పెద్ద యుద్ధానికి దారితీస్తుందని భావించామనీ, ఇదే నెపంతో భారత్ తమపై దాడికి చేస్తుందని భయపడ్డామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ తెలిపారు.
ప్రస్తుతం భారత్ - చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఘర్షణలపై ఆయన స్పందిస్తూ, గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధానికి దారితీస్తుందని, ఇదేసమయంలో భారత్ తమపై కూడా యుద్ధానికి దిగుతుందని ఆందోళన చెందినట్టు తెలిపారు.
గల్వాన్ లోయలో భారత్ - చైనా సైనికుల మద్య జరిగిన ఘర్షణను తాము సీరియస్‌గా తీసుకొన్నామని, వారి మధ్య చెలరేగిన ఉద్రిక్తత ఎక్కడ తమపైకి యుద్ధం రూపంలో వస్తుందని భయపడ్డామన్నారు. అయితే, తామేమీ చూస్తూ కూర్చోమని, ధీటుగానే సమాధానమిస్తామని తెలిపారు.