వాణిజ్య నౌకల కోసం.. ఏకమైన భారత్‌-చైనా బలగాలు

ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (15:58 IST)
వాస్తవానికి భారత్, చైనాలు బద్ధ శత్రువులు. ఈ రెండు దేశాలు ఒక్క విషయంలో ఏకమయ్యాయి. అదే అరేబియా సముద్రంలో దొంగల బారి నుంచి వాణిజ్య నౌకలను కాపాడేందుకు భారత్‌-చైనా నావికాదళాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. మలేషియాలోని కెలాంగ్‌కు పోర్ట్‌ఆఫ్‌ అడెన్‌కు మధ్య ప్రయాణిస్తున్న ఒక భారీ వాణిజ్య నౌకపై సముద్ర దొంగలు దాడిచేశారు. దీనిని రక్షించేందుకు ఐఎన్‌ఎస్‌ ముంబై, ఐఎన్‌ఎస్‌ తారక్ష్ రంగంలోకి దిగాయి. 
 
ది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌(యుకేఎంటీవో) నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ నౌకలు రంగంలోకి దిగాయి. ఇది దాదాపు 21,000 కిలోమీటర్ల మేరకు సముద్రాన్ని పరిశీలిస్తుంటుంది. ఈ మార్గాన్ని చైనా, ఇటలీ, పాకిస్థాన్‌కు చెందిన నౌకలు కూడా పరిరక్షిస్తుంటాయి. ఈ దేశాల నౌకలు కూడా స్పందించాయి. 
 
కానీ భారత నావికాదళం వేగంగా స్పందించి సదరు వాణిజ్య నౌకకు ఒక హెలికాప్టర్‌ను పంపించింది. అదేసమయంలో చైనాకు చెందిన ప్రత్యేక బలగాలు నౌకలోకి ప్రవేశించి సముద్రదొంగల కోసం గాలింపు చేపట్టాయి. దీంతో సముద్రదొంగలు పరారయ్యారు. ఈ సందర్భంగా చైనా బలగాలు.. భారత బలగాలకు కృతజ్ఞతలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి