టర్కీ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆ దేశానికి కేవలం వెడ్డింగ్ టూరిజం ద్వారా భారతీయుల నుంచి ఏటా వచ్చే రూ. 11,000 కోట్లు రాకుండా పోయాయి. పాకిస్తాన్ దేశానికి బహిరంగ మద్దతు పలికిన టర్కీ అంటే ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాకిస్తాన్ దేశానికి ఏ ముఖం పెట్టుకుని మద్దతు ఇచ్చారు అంటూ నిలదీస్తున్నారు. తమ ఆగ్రహాన్ని టర్కీపై రకరకాల రూపంలో చూపిస్తున్నారు.
ఐతే భారత్-పాక్ యుద్ధ సమయంలో టర్కీ బహిరంగంగా పాకిస్తాన్ దేశానికి మద్దతు ఇచ్చింది. ఆ దేశానికి డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా సైనికులను కూడా పంపినట్లు వార్తలు వచ్చాయి. టర్కీ భూకంపం సమయంలో భారతదేశం ఆ దేశానికి రూ. 6 లక్షల డాలర్ల సాయం అందించింది. దాన్ని కూడా పక్కకు తోసి టర్కీ ఇలా వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేందుకు యత్నించడంపై ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా టర్కీతో వున్న అన్ని వ్యాపార సంబంధాలను తెంచేసుకుంటున్నారు. దీనితో టర్కీకి వచ్చే ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ పరిణామంపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తలపట్టుకుని కూర్చున్నడు.