టర్కీ దేశానికి తనను వెళ్లనివ్వడం లేదంటూ ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ టర్కీకి వెళ్లనే వెళ్లారు. టర్కీలో మహదీ అనే వ్యక్తితో కలిసి ఓ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోలో పాల్ మాట్లాడుతూ... పాకిస్తాన్ దేశానికి టర్కీ మిస్సైల్స్ అమ్మింది వాస్తవమే ఐతే అంతకుముందు అమెరికా కూడా పాకిస్తాన్ దేశానికి మిసైల్స్ అమ్మింది కదా అంటూ చెప్పారు.
యుద్ధం అనేసరికి ప్రతి దేశం ఇలాగే యుద్ధ సామగ్రిని కొంటుందని చెప్పిన పాల్... ట్రంప్ సౌదీ అరేబియాకు ఎందుకు వచ్చారో తెలుసా? మిస్సైల్స్ అమ్మడానికేనంటూ వెల్లడించారు. యుద్ధం జరిగితే ఎంతోమంది పౌరులు ప్రాణాలు కోల్పోతారు. ఇక అణుయుద్దం సంభవిస్తే కోట్లమంది మరణిస్తారు. అందుకే యుద్ధం చేసేవారు కాదు ఆపేవారు కావాలంటూ చెప్పుకొచ్చారు పాల్.