కోడి... గుడ్డు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ.. 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్నాడు. ఈ విచిత్ర ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14 ఏళ్ల బాలుడు.. గత రెండేళ్ల నుంచి గుడ్లు పెడుతున్నాడట. ఇప్పటివరకు 20 గుడ్లు పెట్టాడని ఆ బాలుడి తండ్రి వెల్లడించాడు.
అక్మల్‌ను వైద్యుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే.. వైద్యుల ఎదుటే అక్మల్ రెండు గుడ్లు పెట్టాడు. అంతేగాకుండా అక్మల్‌కు ఎన్ని పరీక్షలు నిర్వహించినా.. అసలు విషయం ఏమిటో వైద్యులు కనుగొనలేకపోయారు. ఇంకా మనిషి గుడ్లు పెట్టడం అసాధ్యమని.. అక్మల్ గుడ్లు మింగేసి వుండటంతో అవి బయటికి వచ్చివుండొచ్చునని చెప్తున్నారు.