ఆయన కోసం పాముల రక్తం తాగిన ఇండోనేషియా సైనికులు (వీడియో)

సోమవారం, 29 జనవరి 2018 (14:41 IST)
యూఎస్ రక్షణ శాఖ సెక్రటరీ జిమ్ మాటిస్ ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండోనేషియాకు వెళ్లారు. ఆ సమయంలో ఇండోనేషియా ఆర్మీకి చెందిన పలువురు సైనికులు పాముల రక్తం తాగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సౌత్‌ఈస్ట్ ఏసియాతో మిలిటరీ సంబంధాలను మెరుగు పరుచుకోవడం కోసం ఇండోనేషియాలో మాటిస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోసం ప్రత్యేకంగా ఇండోనేషియా సైన్యం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. 
 
ఆ ప్రదర్శనలో భాగంగా సైన్యం చేసిన స్టంట్స్ ఆధ్యంతం అబ్బుర పర్చాయి. ముఖ్యంగా పాముల తలలను నరికి వాటి రక్తాన్ని సైన్యం తాగేసిన తీరు జిమ్ మాటిస్‌కు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాటిలో కింగ్ కోబ్రాలు కూడా ఉండటం గమనార్హం. ఇక ఇండోనేషియా సైన్యం పాముల రక్తాన్ని జుర్రేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు