ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్ శివారులో తన వాహనంలో వెళ్తున్న ఫక్రిజాదేపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఫక్రీజాదే ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఇరాన్ రక్షణశాఖకు చెందిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధిపతిగా ఫక్రిజాదే పనిచేశారు. ఈ హత్య వెనుక ఇజ్రాయేల్ హస్తం ఉన్నట్లు ఇరాన్ ఆరోపించింది.
ఇరాన్ శాస్త్రవేత్త ఫక్రీజాదేను హత్య వెనుక ఇజ్రాయెల్ నేరతత్వం, పిరికితనం స్పష్టంగా కన్పిస్తున్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ డబుల్ గేమ్ ఆడుతోందని..దీనిని ఖండించాల్సిన అవసరముందని తెలిపింది. తమ శాస్త్రవేత్త హత్యకు ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పింది.