వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడా నుంచి చిన్న సైజు విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఫైలట్ తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అది గమనించిన ప్రయాణికుడు కాక్పిట్‌లోని రేడియో ద్వారా సాయం కోరాడు. పైలట్ స్పృహ తప్పి పడిపోయాడని, తన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలిపాడు. తనకు విమానం నడపడం అసలు తెలియదని చెప్పాడు.
అనంతరం ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది.. విమానాన్ని ప్యాసెంజర్ సీటు నుంచే నడిపేలా కంట్రోల్‌ను ఎనేబుల్ చేశారు అలాగే ప్రయాణికుడ్ని శాంతింపజేసి వింగ్స్ లెవెల్ మెయింటెన్ చేయాలని సూచించారు. ప్రయాణీకుడితో స్పష్టంగా మాట్లాడేందుకు అతని ఫోన్ నంబర్ అడిగి.. పాల్మ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో కమ్యూనికేట్ చేయించారు.