కాంగో దళాల చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని అలైట్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. బెని, లుబెరో ప్రాంతాల్లోని పౌరులపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడినట్టు వెల్లడించారు. నిద్రపోతున్న ప్రజలను లేపి, తాళ్లతో చేతులు కట్టి కత్తులు, గొడ్డళ్ళతో అతి కిరాతకంగా నరికి చంపారని తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్‌తో ముడిపడివున్న తిరుగుబాటు సంస్థ ఏడీఎఫ్. ఈ సంస్థ ఉగాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పౌరులే లక్ష్యంగా కొన్నేళ్ళుగా దాడులకు పాల్పడుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 6 వేల మంది పౌరులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హత్య చేశారు. దీంతో ఏడీఎఫ్‌పై అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలు ఆంక్షలు విధించాయి.