ప్రపంచ అందగత్తెలను చంపేస్తాం.. మనీలాపై ఆత్మాహుతి దాడులకు ఐసిస్ పిలుపు

గురువారం, 11 ఆగస్టు 2016 (17:04 IST)
వచ్చే యేడాది ఫిలిప్పైన్స్ రాజధాన మనీలాలో విశ్వసుందరి (మిస్ యూనివర్స్) పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థ నుంచి తీవ్ర ముప్పు పొంచివుంది. ముఖ్యంగా ఈ పోటీల్లో పాల్గొనే అందగత్తెలను చంపేస్తామని ఆ సంస్థ తీవ్రవాదులు హెచ్చరించారు. అంతేకాకుండా, ఈ పోటీలపై కూడా ఆత్మాహుతి దాడులు చేస్తామని ప్రకటించింది. 
 
కాగా, విశ్వసుందరి పోటీల్లో 16 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనున్నారు. వీరిలో ఐసీస్‌పై దాడులను ప్రొత్సహిస్తున్న దేశాలకు చెందిన అందగత్తెలను చంపుతామని ఐసీస్‌ ప్రకటించింది. అంతేకాదు ఐఎస్‌ ఫిలిఫ్సైన్స్ మద్దతుదారుల పేరుతో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆత్మాహుతి దాడులకు వాడే బెల్టులు, దుస్తులు ఎలా తయారు చేయాలో వివరించారు. మిస్‌ యూనివర్స్‌గా ఎంపిక అయిన వారిని ఖచ్చితంగా చంపాలని జిహాదీలకు ఆదేశాలు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి