మరో 300 మందికి గాయాలయ్యానని మానవ హక్కుల పరిశీలనా సంస్థ పేర్కొంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గౌటాలో దాదాపు నాలుగు లక్షల మంది నివాసం వుంటున్నారు. అలాంటి ప్రదేశంలో సైన్యం బాంబుల మోత మోగించడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.