లక్షలాది భారతీయులకు వరం కానున్న ఓ బిల్లును అమెరికాలో డెమొక్రాట్లు సభలో ప్రవేశపెట్టారు. కాంప్రెహెన్సివ్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ బిల్లు పేరిట దీన్ని సెనెటర్ బాబ్ మెనెండెజ్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ మెంబర్ లిండా శాంచెజ్ ప్రతిపాదించారు.
గ్రీన్ కార్డులకు సంబంధించి వీటిపై గల వార్షిక కాల పరిమితులను తొలగించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. దీంతో ముఖ్యంగా ఇండియా నుంచి మరింత మందిని దేశంలోకి అనుమతించవచ్చు. ఇక తమ పేరెంట్స్ ఇమ్మిగ్రేషన్కు క్వాలిఫై కావడానికి 21 ఏళ్ళ ముందు ఎవరైనా ఇక్కడ చేరిన పక్షంలో గ్రీన్ కార్డు పొందడానికి వారు అనర్హులనే నిబంధన విషయంలో కూడా ఈ బిల్లు సరళీకృత విధానాన్ని అనుసరిస్తోంది. ఈ అనర్హతను ఇక తొలగించనున్నారు.