భర్తతో తొలిసారి డేట్.. డౌగ్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేశాను.. కమలా హారిస్

మంగళవారం, 19 జనవరి 2021 (13:30 IST)
Kamala Harris
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్హాఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమలా హారిస్ తన భర్తతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భర్తతో తొలి డేట్‌కు వెళ్లేటప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలిపారు.

సీబీఎస్ న్యూస్ సండే మార్నింగ్ అనే కార్యక్రమంలో కమలా హారిస్ ఈ విషయాన్ని తెలిపారు. ఆరేళ్ల క్రితం కమలా హారిస్, డౌగ్ ఎమ్హాఫ్ వివాహం జరిగింది. అంతకుముందు సహజీవనం చేసిన ఈ జంట ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్ష దంపతులుగా మారారు. 
 
కమలా హారిస్ దంపతులపై ఎవ్వరికీ తెలియని పలు విషయాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.  ''నా భర్త మంచి స్నేహితుడు అని.. నన్ను నమ్మమంటూ" ప్రపోజ్ చేశారని చెప్పారు. తొలి డేట్‌కు గూగుల్‌లో సెర్చ్ చేసిన విషయం తెలుసుకుని భర్త షాకైనట్లు కమలా హారిస్ తెలిపారు.

ఇంకా మెసేజ్‌లు కూడా పంపించుకుంటామని వెల్లడించారు. కమలా హారిస్ గురించి తనకు ముందే తెలుసునని భర్త డౌగ్ వెల్లడించారు. ఆ సమయంలో కాలిఫోర్నియాలో అటార్నీ జనరల్‌గా వ్యవహరించారు. చక్స్ అండ్ జీన్స్ అంటే తనకు ఇష్టమని కమలా హారిస్ అన్నారు. 
 
భర్త డౌగ్‌ను కలిసేటప్పుడు ఆయన చక్స్ అండ్ జీన్స్‌లో వున్నారని తెలిపారు. డౌగ్ మాట్లాడుతూ.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ మారడంతో తనను జెంటిల్మెన్‌గా నిలబెట్టిందని వెల్లడించారు. కమలా హారిస్‌ను తాను హనీ అని పిలుస్తానని చెప్పారు.

ఇకపోతే.. కమలా హారిస్ జంట ఆగస్టు 22, 2014లో కాలిఫోర్నియాలోని బర్బరాలో వివాహం చేసుకుంది. కమలాహారిస్ తన భర్తకు రెండో భార్య. ఇంకా ఇద్దరు పిల్లలకు పిన్ని (స్టెప్ మదర్) కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు