కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెనుభూతమైంది. ఇదే విషయంపై భార్యతో పలుమార్లు భర్త గొడవ పెట్టుకున్నాడు. నేను అలాంటిదాన్ని కాదు అంటూ మొత్తుకున్నప్పటికీ.. భర్తకు పట్టిన అనుమాన భూతం మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో భార్య గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా హుణసూరు కల్కుణికె హోసింగ్ బోర్డు కాలనీలో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ కాలనీకి చెందిన సౌమ్య(30), రవి అనే దంపతులు ఉన్నారు. వీరికి 11 యేళ్ళ క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం పెరిగింది. దీంతో ఆమెతో అనేకసార్లు గొడవ పడ్డాడు. ఒకటిరెండుసార్లు పోలీసుల వద్దకు వెళ్లగా రాజీ చేసి పంపారు.