భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్ సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పైగా, ఈమె భారతీయ సంతతికి చెందిన మహిళ కావడంతో ప్రతి ఒక్కరి కళ్లూ ఆమెపైనే కేంద్రీకృతమైవున్నాయి.
ఆఫ్రికన్- ఏషియన్ మూలాలున్న కమలా హారిస్... శ్యామలా గోపాలన్. ఈమె తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. 1958లోనే అమెరికా వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో 1964 అక్టోబరు 20వ తేదీన కమలా హారిస్ జన్మించారు. ఈమె తండ్రి జమైకా వాసి. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2016లో సెనేట్‌కు ఎన్నికయ్యారు.
బైడెన్ హయాంలో ఓ చరిత్రాత్మక పాత్రను ఆమె పోషించబోతున్నారంటూ అమెరికన్ మీడియా ఇప్పటికే అనేక కథనాలు రాసింది.. రాస్తోంది. 'మా ముందున్నది సంక్లిష్టమైన దారి. మేం పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం అంత సులువు కాదని మాకు తెలుసు. అయితే ఓ స్థిర సంకల్పంతో ఈ ప్రయాణం ప్రారంభిస్తున్నాం' అని తాజాగా వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్ సోమవారం సెనేటర్ పదవికి రాజీనామాను చేశారు. తన రాజీనామా లేఖను కాలిఫోర్నియా గవర్నర్ కెవిన్ న్యూసోమ్‌కు సమర్పించారు. దేశ ఉపాధ్యక్షురాలే సెనెట్ ప్రెసిడెంట్ కానుండడం వల్ల ఆ హోదాలో ఆమె పాత్ర కీలకం కానుంది.