కాగా, ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్రంప్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'ఎంతో భయంకరమైన ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కోసం నేను, మెలానియా దేవుడిని ప్రార్థిస్తున్నాం. యావత్తు దేశం కోసం, ఐక్యత, శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ బాధ నుంచి కోలుకునే శక్తిని బాధిత కుటుంబాలకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని అందులో పేర్కొన్నారు.
కాగా, అమెరికా లాస్‌వెగాస్‌లోని మండాలే బే హోటల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 58కి పెరిగిందని అక్కడి అధికారులు ప్రకటించారు. కాల్పులు జరిపిన దుండగుడిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో 200 మందికి పైగా గాయాలు అయ్యాయని, వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. దుండగుడు ఓ గదిలో ఉండి ఈ కాల్పులకు పాల్పడ్డాడని ఆ గదిలో పెద్ద ఎత్తున తుపాకులు కూడా లభ్యమయ్యాయని చెప్పారు. ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడు లాస్ వెగాస్ వాసేనని పోలీసులు ధృవీకరించారు.