సముద్రంలో కూలిన విమానం... 12 గంటలు ఈది ఒడ్డుకు చేరిన రక్షణమంత్రి

గురువారం, 23 డిశెంబరు 2021 (07:51 IST)
ఇటీవల 64 మంది ప్రయాణికులతో వెళ్తూ హిందూ మహాసముద్రంలో ఒక బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మంత్రి సోమవారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే నడి సముద్రంలోకి వెళ్లిన తర్వాత హెలికాఫ్టరులో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది కుప్పకూలిపోయింది. దీంతో మంత్రితో ప్రయాణించిన ముగ్గురి జాడ కనిపించలేదు. 
 
కానీ, ఆయన మాత్రం సీటును ఊడబెరికి దాన్ని లైఫ్ జాకెట్‌లా ఉపయోగించుకున్నారు. ఆపై 12 గంటల పాటు ఈది తీరానికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన ఓ జాలరి తీరానికి సమీపంలో ఆయన్ను గమనించి ఒడ్డుకు చేర్చారు. మరోవైపు, మంత్రితో పాటు ప్రయాణించినవారిలో చీఫ్ వారెంట్ అధికారి జిమ్మీ లాయిట్సారా కూడా అలాంటి సహసమే చేశారు. 
 
ఆయన కూడా ఈదుకుంటూ మహాంబో తీరానికి చేరుకున్నారు. ప్రాణాలతో బయటపడిన రక్షణ మంత్రి జనరల్ సెర్జ్ గెల్లె ఆ తర్వాత ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. పైవాడి నుంచి తనకు పిలుపు రాకపోవడం వల్లే తీరానికి చేరుకోగలిగాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు