ఈ సందర్భంగా బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, ఇలాంటి కథ సోహెల్ కి కరెక్ట్. హుశారు తర్వాత ఆ తరహాలో మరో మంచి కథలో వస్తున్న సినిమా బూట్‌కట్ బాలరాజు. జనవరి, పిబ్రవరిలో వరుసగా షెడ్యూల్స్ జరిపి సినిమా పూర్తి చేస్తాం. తెలంగాణ క్యారెక్టరైజేషన్ కావడంతో తెలుగమ్మాయి కావాలని అనన్యని తీసుకున్నాం. నామిత్రుడు భాష గ్లోబల్ ఫిలింస్‌తో ఈ సినిమాతో అసోసియేట్ అవుతున్నారు`` అన్నారు.
సోహెల్ మాట్లాడుతూ - ``బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న రెండో చిత్రమిది. దాదాపు తొమ్మిది నెలలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. బూట్ కట్ బాలరాజు అనే క్యారెక్టర్ డెఫినెట్‌గా మీ అందరిలో ఉండిపోతుంది. అన్ని వర్గాల వారు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. కోనేటి శ్రీను చాలా పర్‌ఫెక్షనిస్ట్. దాదాపు తొమ్మిది నెలలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం`` అన్నారు.
నటీనటులు: సోహెల్, అనన్య నాగళ్ల, శ్రీమతి ఇంద్రజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆనంద్ చక్రపాణి, ఝాన్సి, జబర్‌దస్త్ రోహిణి, మాస్టర్ రామ్ తేజస్