అమెరికా చేరుకున్న మలేరియా మాత్రలు

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (07:25 IST)
కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటానన్న భారత్.. తన మాట నిలబెట్టుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే అమెరికా, బ్రిటన్​లకు ఔషధాలను ఎగుమతి చేసింది.

అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను అమెరికాకు పంపించింది. ఈ డ్రగ్​ న్యూయార్క్ చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

బ్రిటన్​కు సైతం  భారత్ పారాసిటమాల్ ప్యాకెట్లను ఎగుమతి చేసింది. వీటితో పాటు ఈ డ్రగ్ ఉత్పత్తిలో వినియోగించే ముడిపదార్థాలనూ అమెరికా, బ్రిటన్​లకు పంపించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు