ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

సెల్వి

సోమవారం, 5 మే 2025 (08:18 IST)
Man_River
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు. కానీ శవమై తేలాడు. అతడే స్వయంగా నదిలోకి దూకినట్లు గల వీడియోను ఆర్మీ విడుదల చేసింది. ఇందుకు భద్రత దళాలే కారణమని ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో తనంతట తానుగానే నదిలో దూకినట్టు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యింది. దీంతో అతడి చావుకి సైన్యం కారణం కాదని తేలిపోయింది.
 
ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే (23).. చుట్టూ ఒకసారి చూసిన తర్వాత రాళ్లతో నిండిన నదిలోకి దూకుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తి పట్ల సమాచారం అందడంతో శనివారం నాడు మాగ్రేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. 
Man River
 
కుల్గాం జిల్లా తంగ్‌మార్గ్ అడవిలో దాక్కున్న ఉగ్రవాదులకు ఆహారం, ఇతర అవసరాలను అందించానని విచారణ సందర్భంగా అతడు అంగీకరించినట్టు తెలుస్తోంది. కానీ నదిలో దూకి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఉగ్రవాదులకు సహాయం.. నదిలోకి దూకిన వ్యక్తి..

కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే (23)ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. విచారణలో అతను టాంగ్‌మార్గ్ అడవిలో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం అందించినట్లు అంగీకరించాడు. ఆదివారం వేషా నదిలో దూకి తప్పించుకునేందుకు… pic.twitter.com/jR2bwdjJ6t

— ChotaNews App (@ChotaNewsApp) May 5, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు