సింగపూర్ మెట్రో రైలులో ఓ మహిళను సీక్రెట్‌గా వీడియో తీసిన కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఔట్రామ్ స్టేషన్ నుంచి హార్బర్ ఫ్రంట్ వెళ్తుండగా, పైకి హుందాగా కనబడుతున్న ఓ వ్యక్తి అదే రైలు ఎక్కాడు. బోగీ మొత్తం ఖాళీగానే ఉన్నప్పటికీ సరిగ్గా ఓ మహిళ ఎదురుగా వెళ్లి కూర్చున్నాడు. మెల్లగా సెల్‌ఫోన్ తీసి సీక్రెట్‌గా సదరు మహిళను వీడియో తీయడం మొదలెట్టాడు.