హిబ్రల్ మానసిక స్థితి బాగో లేకపోవడంతో.. అతనికి జైలు శిక్ష విధిస్తే ప్రయోజనం వుండదని అతని తరపు న్యాయవాది వాదించాడు. ఆ వాదనతో ఏకీభవించని జడ్జి.. హిబ్రల్ మానసిక స్థితిని అర్థం చేసుకునే మరణ శిక్ష విధించట్లేదని న్యాయమూర్తి తెలిపారు. కావాలంటే శిక్ష అనుభవించే ముందు హిబ్రల్‌కు మానసిక వైద్యం అందించేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. అయితే హిబ్రల్ మాత్రం శిక్షను అనుభవించేందుకు నేరుగా జైలుకు వెళ్లాడు.
2004 ఏప్రిల్ 9న ముర్రేస్విల్లెలోని ఫ్రాంక్లిన్ రీజనల్ హైస్కూల్లో తాను చదివే స్కూల్లోనే కత్తులతో వీరంగం వేసిన అలెక్స్ హ్రిబల్ తోటి విద్యార్థులపై దాడి చేశాడు. రెండు వంట గది కత్తులతో 21 మంది విద్యార్థులను, ఒక వ్యక్తిని విచక్షణరహితంగా పొడిచి చంపేసిన హిబ్రల్‌కు కోర్టు 60ఏళ్ల శిక్షను ఖరారు చేసింది.