నూతనాధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతంకం చేశారు. కరోనా వైరస్, ఇమ్మిగ్రేష్, వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమైన 17 కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు.
డెమొక్రాట్లు మరింత విస్తృతమైన, సత్వర శాసన సభ చర్యల నిమ్తితం ముందుకు రావడంతో గతంలో ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను రద్దు చేస్తూ.. 10 రోజుల పాటు కార్యాచరణ ప్రణాళికలపై దృష్టి సారించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్‌పై యుద్ధానికి ప్రాముఖ్యత కనబర్చారు.
జాతి వివక్ష నిర్మూలన దిశగా... బ్లాక్, లాటినో, నేటివ్, ఏషియన్, పసిఫిక్ ద్వీపాల, ఎల్‌జీబీటీక్యూ, మతపరమైన మైనార్టీ వ్యక్తులకు సమాన హక్కులను నిర్వచిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా బైడెన్ సంతకం చేశారు.