మెలానియా ట్రంప్‌కు కరోనా నెగటివ్.. 622కి చేరిన మృతుల సంఖ్య

బుధవారం, 25 మార్చి 2020 (09:09 IST)
అమెరికా ప్రథమ మహిళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆమెకు వైరస్ సోకలేదని తేలడంతో వైట్ హౌస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నెల 13న డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ట్రంప్‌కు నెగెటివ్ వచ్చిన  విషయాన్ని వెల్లడించారు. 
 
మెలానియా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కాగా, కరోనా వైరస్ అమెరికాను కూడా అతలాకుతలం చేస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో వైరస్ వ్యాప్తి తీవ్రత మరింతగా పెరగగా, పది వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యూఎస్‌లో వైరస్ బారినపడిన వారి సంఖ్య 49,594కు చేరింది. 
 
మంగళవారం ఒక్క రోజే 130 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 622కి చేరుకుంది. వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 16,961 మంది మరణించగా, వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 4 లక్షలను దాటింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు