ముఖ్యంగా, పన్నులను భారీగా పెంచేశారు. విద్యుత్ చార్జీలను ఫ్రీజ్ చేశారు. ఫలితంగా ఆరోగ్యకరమైన భోజనానికి అనేక మంది దూరమైపోతున్నారు. అన్ని రకాల వస్తువులు ఏకంగా పది శాతానికిపైగా పెరిగిపోయాయి. దీంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోయింది. దాదాపు 80 శాతం మంది ప్రజలు సంక్షోభంలో చిక్కుకునిపోయారు.
దేశ ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశ పౌరుల జీవన వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫలితంగా దాదాపు సగం మంది యూకే ప్రజలు తాము తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారని, తీసుకునే భోజనాల సంఖ్యను తగ్గిస్తున్నారని 'విచ్' అనే సంస్థ తెలిపింది. ఈ సంస్థ తాజాగా 3 వేల మందిపై ఓ సర్వే నిర్వహించి, ఈ ఫలితాలను వెల్లడించింది.
దేశంలో ఆర్థిక సంక్షోభానికి ముందు పోలిస్తే, దాదాపు 80 శాతం మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవన వ్యయ సంక్షోభం ప్రజలపై వినాశకర ప్రభావాన్ని చూపిస్తుందని 'విచ్' ఫుడ్ పాలసీ హెడ్ స్యూ డేవీస్ ఆందోళన వ్యక్తం చేశారు.