మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

ఠాగూర్

ఆదివారం, 30 మార్చి 2025 (11:23 IST)
మయన్మార్, థాయ్‌లాండ్‌లతో పాటు దేశాలను వణికించిన భూకంపం తీవ్రత 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏకకాలంలో 334 అణుబాంబులు విస్పోటనం చెందితే ఎంత శక్తి విడదలవుతుందో ఈ భూకంపం సంభవించినపుడు కూడా అంతటి శక్తి వెలువడిందని భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెఫ్ ఫీనిక్స్ అభిప్రాయపడ్డారు. టెక్టానిక్ ఫలకాలు, యురేషియన్ ఫలకాలు వరుసగా ఢీకొటుండటం వల్ల మయన్మార్, థాయ్‌లాండ్‌లలో నెలల తరబడి ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. 
 
భూకంపం సంభవించిన తర్వాత కూడా దాని ప్రభావం కొంతసేవు కొనసాగుతుంది. స్వల్ప స్థాయిలో పలుమార్లు భూమికంపిస్తుంది. దీనినే ఆఫ్టర్ షాక్స్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. మయన్మార్‌లో కేవలం 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి 1644 మంది మరణించగా 3 వేలకు పైగా ప్రజలను గాయపడ్డారు. భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుని ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు