ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఠాగూర్

శుక్రవారం, 28 మార్చి 2025 (23:38 IST)
ఆగ్నేయాసియా దేశాలను ఓ భారీ భూకంపం వణికించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. ఈ ప్రకంపన ధాటికి భారీ భవనాలు సైతం నేలమట్టమయ్యాయి. మయన్మార్‌లో పలుచోట్ల రోడ్లు బీటలు వారాయి. ఒక్క రోజులోనే మూడు వరుస భూకంపాలు ఈ చిన్న దేశాన్ని అతలాకుతలం చేశాయి. 
 
మయన్మార్‍‌లో భూకంపం కారణంగా ఇప్పటివరకు 153 మంది మృతి చెందారు. భవనాల శిథిలాల్లో చిక్కుకుని 800 మంది గాయపడ్డారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అటు థాయ్‌‍లాండ్‌‍, బంగ్లాదేశ్‌లోనూ భూకంపాలు సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదయ్యాయి. 
 
మరోవైపు, భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు భారత్ తనవంతుగా ముందుకు వచ్చింది. మయన్మార్‌కు మానవతా కోణంలో సాయం చేసేందుకు వివిధ రకాలనై సామాగ్రిని పంపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు