మరోవైపు టర్కీ ముఖ్యనగరమైన ఇస్తాంబుల్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ పేలుళ్లు సంభవించాయి. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు సమాచారం. పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు తెలియవచ్చింది. తొలి పేలుడు ఫుట్‌బాల్ స్టేడియం బయట జరగగా.. రెండోది ఓ పార్క్ ఆవరణలో జరిగినట్లు సమాచారం.