రసాయన శాస్త్రంలో మరో ఇద్దరికి నోబెల్ పురస్కారం

బుధవారం, 6 అక్టోబరు 2021 (17:08 IST)
ఈ యేడాది రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం వరించింది. వీరిలో జ‌ర్మనీకి చెందిన‌ బెంజ‌మిన్ లిస్ట్‌, అమెరికాకు చెందిన‌ డేవిడ్ డ‌బ్ల్యూసీ మెక్‌మిల‌న్‌లు ఉన్నారు. వీరిద్దరికి ఈ యేడాది రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇస్తున్నట్టు రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ప్రకటించింది. విజేత‌ల‌కు 11 లక్ష‌ల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీని స‌మానంగా పంచుతారు.
 
రసాయన అణువుల‌ను నిర్మించడానికి అసిమెట్రిక్ ఆర్గానోకాట‌లిసిస్ అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసినందుకుగాను ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు వీరిద్దరూ సొంతం చేసుకున్నారు. లిస్ట్‌, మెక్‌మిల‌న్‌ల ఆవిష్క‌ర‌ణ ఫార్మాసూటిక‌ల్ ప‌రిశోధ‌న‌ల‌పై గొప్ప ప్ర‌భావం చూపింద‌ని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ పేర్కొంది. 
 
బెంజ‌మిన్ లిస్ట్ 1968లో జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌లో జ‌న్మించారు. 1997లో గోతె యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్ర‌స్తుతం మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. 
 
ఇక మెక్‌మిల‌న్ 1968లో యూకేలోని బెల్‌షిల్‌లో జ‌న్మించారు. 1996లో యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్‌డీ చేశారు. ప్ర‌స్తుతం ప్రిన్స్‌ట‌న్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్‌గా ఉన్నారు. 
 
విజేతల‌ను బుధ‌వారం రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ గొరాన్ హాన్స‌న్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే సోమ‌, మంగ‌ళ‌వారాల్లో మెడిసిన్‌, ఫిజిక్స్‌ల‌లో నోబెల్ బ‌హుమతులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు