రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం కుప్పకూలిపోవడంతో అనుచరులతో సహా కన్నుమూశారు. ఈ విషయం తమనేమీ ఆశ్చర్యానికి గురిచేయలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రెయిన్ కూడా ఈ ప్రమాదంపై స్పందించింది. వాగ్నర్ చీఫ్ మరణం రష్యాలోని ప్రముఖులకు ఓ హెచ్చరికలాంటిదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సహాయకుడు మిఖైలో పొడొలియాక్ చెప్పారు.
ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాగ్నర్ గ్రూపు కూడా పాల్గొంది. ప్రిగోజిన్ స్వయంగా తన దళాలను ముందుండి నడిపించారు. ఈ దళాల వల్లే ఉక్రెయిన్‌కు ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, తమకు సరిపడా ఆయుధాలు ఇవ్వట్లేదని, జూన్ 23 వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు ప్రకటించారు.
ఆపై తన సైనికులను మాస్కో వైపు నడిపించాడు. ఆ మరుసటి రోజే తన నిర్ణయాన్ని ప్రిగోజిన్ ఉపసంహరించుకున్నాడు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోవడంతో అమెరికా, ఉక్రెయిన్ సహా పలు దేశాలు పుతిన్ పైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.