భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

ఠాగూర్

మంగళవారం, 6 మే 2025 (12:21 IST)
భారత్ కుట్రపన్ని పహల్గాం దాడి చేసుకుని (ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్).. పాకిస్థాన్‌పై నిందలు మోపుతోందంటూ అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెడుతున్న పాకిస్థాన్‌కు అనేక దేశాలు మందలించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్యదేశాలన్ని ఛీకొట్టాయి. పైగా, ఇస్లామాబాద్ బహిరంగ అణు బెందిరింపులకు దిగడంపై మండిపడుతూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ తరహా బెదిరింపులు ప్రాంతీయ అస్థిరతలకు దారితీస్తాయంటూ హెచ్చరించింది. 
 
పహల్గాం ఉగ్రదాడిని ఏదో రూపంలో భారత్‌పై నెట్టేందుకు పాకిస్థాన్ నానా తంటాలు పడుతోంది. ఇందుకోసం భద్రతా మండలిలో తీర్మానం చేయాలని ప్లాన్ వేసింది. ఇది బెడిసికొట్టడమే కాకుండా, దాయాది దేశాల నుంచి కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్ళు నమిలింది. 
 
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంగళవారం భద్రతా మండలిలో క్లోజ్డ్ డోర్ సమావేశం జరిగింది. ఇప్పటికే ఇస్లామిక్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సభ్య దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ఆ దేశం అభ్యర్థనపైనే ఈ సమావేశం జరిగింది. తన సభ్యత్వాన్ని అడ్డం పెట్టుకుని భారత్ వ్యతిరేక తీర్మానం చేయాలని తొలుత భావించింది. కానీ, పాక్ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి, దానికే ఎదురు క్లాస్ తీసుకున్నాయి. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పాకిస్థాన్‌కు దాయాది దేశాలన్ని ప్రశ్నలు ఎక్కుపెట్టాయి. ఈ ప్రశ్నలకు పాక్ తరపున ఐరాస శాశ్వత ప్రతినిధి అసీమ్ ఇఫ్తికార్ అహ్మద్ సమాధానం చెప్పలేకపోయారు.
 
భారత్‌పై అణు దాడి చేస్తామంటూ పాక్ పాలకులు బహిరంగ బెదిరింపులకు దిగడంపై సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, తాజాగా పాకిస్థాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని కూడా ప్రశ్నించాయి. అది ఉద్రిక్తలు పెంచి ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించాయి. అదేసమయంలో భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసుకుందా.. ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదా అంటూ ప్రశ్నించాయి. ఈ వాదనను సభ్యదేశాలన్ని తిరస్కరించాయి. పహల్గాం దాడిలో లష్కరే తోయిబా పాత్రను ప్రశ్నించాయి. అంతేకాదు, ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయకులను చంపడంపై ఆందోళన వ్యక్తంచేశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు