చైనా-పాకిస్తాన్ అచ్చమైన అన్నదమ్ములు: నవాజ్ షరీఫ్

బుధవారం, 22 ఏప్రియల్ 2015 (14:23 IST)
చైనా-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా చైనా.. పాకిస్థాన్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. దీంతో, పాక్ తన కృతజ్ఞతలను మరోరూపంలో వెల్లడించింది. పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన 'నిషాన్-ఈ-పాకిస్థాన్'తో సత్కరించింది.
 
పాక్ అధ్యక్షుడు మమ్నూన్ ఈ పురస్కారాన్ని జిన్ పింగ్‌కు ప్రదానం చేశారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో ఈ ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నవాజ్ షరీఫ్, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 
 
కాగా, జీ జిన్ పింగ్ పాకిస్థాన్ లో పర్యటిస్తున్న సందర్భంగా ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ... చైనా, పాక్ అచ్చమైన అన్నదమ్ములని అభివర్ణించారు. చైనాతో పాక్ పటిష్టమైన సంబంధాలు కలిగివుందని చెప్పారు. అంతకుముందు, జిన్ పింగ్ మాట్లాడుతూ, పాక్‌కు వస్తే సొంత సోదరుడి ఇంటికి వచ్చినట్టుందని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

వెబ్దునియా పై చదవండి