పహల్గాం ఉగ్రదాడిని సాకుగా చూపి తమ దేశాన్ని ఎడారి చేయాలన్న కుట్రతో సింధూ జలాలను నిలిపివేస్తూ భారత్ చేపట్టే ఎలాంటి నిర్మాణాన్నైనా పేల్చివేస్తామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ దాడి తర్వాత పాక్ నడ్డివిరిచేలా కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగా, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్‌కు దిక్కుతోచనిస్థితిలో పడిపోయింది.
ఈ నిర్ణయంపై పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ మాట్లాడుతూ, సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ చేపట్టే ఎలాంటి నిర్మాణాలైనా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కాగా, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం పాకిస్థాన్ ఎడారిగా మారే ప్రమాదంతో పాటు పాకిస్తాన్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని, దీర్ఘకాలకి ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఒప్పందం నిలిపివేత పాక్ నేతలు పలువురు భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ నోరీ పారేసుకున్న విషయం తెల్సిందే. ఇపుడు పాక్ రక్షణ మంత్రి కూడా అలాంటి అవాకులు చవాకులు పేలారు.