పాకిస్థాన్ కరాచీలో హిందూ వైద్యుడిపై కాల్పులు Video

శుక్రవారం, 31 మార్చి 2023 (11:10 IST)
పాకిస్థాన్ కరాచీ నగరంలో గురువారం హిందూ వైద్యుడిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో వైద్యుడు మృతి చెందాడు. అలాగే వైద్యుడి వెంట వున్న సహాయకురాలికి బుల్లెట్ గాయాలు తగిలాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
వివరాల్లోకి వెళితే.. డా.జినానీ అనే హిందూ వైద్యుడు తన అసిస్టెంట్ అయిన ఓ వైద్యురాలితో కలిసి కారులో గుల్షణ్-ఏ-ఇక్బాల్ ప్రాంతానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. లైయారీ ఎక్స్‌ప్రెస్ హైవేలో ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. 
 
ఈ దాడిలో డా. జినానీ అక్కడిక్కడే మృతి చెందగా ఆయన సహాయకురాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల తరువాత డా. జినానీ ప్రయాణిస్తున్న కారు అదుపు కోల్పోయి ఓ గోడకు ఢీకొనడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. 
 
ఈ ఘటనపై సింధ్ గవర్నర్ కమ్రాన్ ఖాన్ టెసోరీ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కరాచీ పోలీస్ అడిషనల్ ఇన్స్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.

An eye surgeon Dr Birbal Genani has been killed and a lady doctor sustained injuries in a gun attack by unidentified assailants on Garden Lyari Expressway Karachi. Dr Birbal was the former director of the Karachi Metropolitan Corporation and the head of the Spencer Eye Hospital. pic.twitter.com/GUNp0aid4H

— Ghulam Abbas Shah (@ghulamabbasshah) March 30, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు