మేం నమ్మినవాళ్లే మమ్మల్ని అవసరానికి ఆదుకోలేదు : అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోడీ

సోమవారం, 22 మే 2023 (13:34 IST)
అంతర్జాతీయ వేదికపై ప్రధానంమత్రి నరేంద్ర మోడీ తన మనసులోని ఆవేదనను బహిర్గతం చేశారు. ఇండియా - పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ సమావేశాల్లో భాగంగా, ఆయన సోమవారం పశ్చిమాశియా దేశాల పేర్లను ప్రస్తావించకుండానే పరోక్ష విమర్శలు గుప్పించారు. నమ్మిన వాళ్లే తమను అవసరానికి ఆదుకోలేక పోయారని వాపోయారు. ప్రస్తుతం ఆయన న్యూగినియా దేశంలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈ సందర్భంగా ఆయన ప్రపంచపై కొవిడ్ ప్రభావం గురించి మాట్లాడారు. కొవిడ్ ప్రభావం లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఓషియానా దేశాలపై అధికంగా ఉందన్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, పేదరికం, ఆరోగ్యపరమైన సమస్యలకు తోడు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 
 
అయితే, ఆపదసమయాల్లో భారత్ తన మిత్రదేశాలకు ఎప్పుడూ అండగా నిలిచిందని చెప్పారు. ఈ క్రమంలో మోడీ పాశ్చాత్య దేశాలపై పరోక్ష విమర్శలు చేశారు. 'ప్రపంచ వ్యాప్తంగా చమురు, ఆహారం, ఎరువులు, ఔషధాల సరఫరా వ్యవస్థల్లో సమస్యలు తలెత్తాయి. ఈ కష్టసమయంలో, మేం నమ్మినవాళ్లే మమ్మల్ని అవసరానికి ఆదుకోలేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు