సెర్చ్ ఇంజిన్ అనే పేరున్న గూగుల్‌లో ఏ విషయం వెతికినా అందుకు తగిన సమాధానం లభిస్తుంది. తాజాగా గూగుల్ మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కింది. ఈ సర్చ్ ఇంజిన్‌లో ఇడియట్ అని టైప్ చేసి... ఇమేజెస్ కోసం వెతికితే... భారీ సంఖ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలను చూపిస్తోంది. మానిటర్ మొత్తం ఆయన ఫొటోలతోనే నిండిపోతోంది.
అయితే గూగుల్ సెర్చింజిన్‌లో ఇడియట్ అంటూ వెతికితే అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ఫోటోలు రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ట్రంప్ వ్యతిరేకులే దీనికి కారణమని సీఎన్ఈటీ అభిప్రాయపడింది. ట్రంప్‌పై ద్వేషం ఉన్నవారు ట్రంప్ ఫొటోను అప్‌లోడ్ చేసి, ఇడియట్ అనే పదాన్ని దానికి జత చేస్తున్నారు.