ఫ్రాన్స్ దేశాధ్యక్షుడుగా మళ్లీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోమారు ఎన్నికయ్యారు. అయితే, ఆయన గెలుపు పట్ల ఫ్రాన్స్ యువతి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఆయన గెలుపునకు నిరసనగా ఆదివారం రాత్రి యువత వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. దీంతో వారిపై పోలీసులు లాఠీని ప్రయోగించారు. బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు వ్యతిరేకంగా సెంట్రల్ పారిస్‌లోని చాట్‌లెట్ సమీపంలో గుమికూడిన యువకులను పోలీసులు చెదరగొట్టారు. యూనివర్శిటీల్లో విద్యార్థులు నిరసన తెలిపారు. కాగా, మాక్రాన్ మాత్రం మరోమారు ఫ్రాన్స్ అధ్యక్షుడు సంపూర్ణ మెజార్టీతో ఎన్నికయ్యారు.
తన ప్రత్యర్థి మెరీన్ లీ పెన్‌పై 16 శాతం ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, వెన్‌కు మాత్రం 42 శాతం ఓట్లు వచ్చాయి. ఈ గెలుపుతో గత రెండు దశాబ్దాల కాలంలో వరుసగా రెండోసారి అధ్యక్షుడుగా ఎన్నికైన నేతగా మాక్రాన్ చరిత్రపుటలకెక్కాడు.