వర్చువల్ విధానంలో భేటీకానున్న మోడీ - బైడెన్

సోమవారం, 11 ఏప్రియల్ 2022 (13:29 IST)
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు సోమవారం వర్చువల్ విధానంలో భేటీకానున్నారు. ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 
 
కాగా, ఉక్రెయిన్ - రష్యా మధ్య సాగుతున్న యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. అయితే, భారత్ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా పదేపదే తప్పుబడుతూ వస్తుంది. దీనికితోడు రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటుంది. తద్వారా రూపాయి - రూబుల్ వర్తకానికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దీనిపై అమెరికా గుర్రుగా ఉంది. 
 
భారత వైఖరిపై జో బైడెన్ ఇప్పటికే పలుమార్లు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ - రష్యా విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని విడనాడాలని ఆయన పదేపదే భారత్‌ను కోరుతున్నారు. కానీ భాత్ మాత్రం తన వైఖరికే కట్టుబడివుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అగ్రనేతల మధ్య జరుగనున్న భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు