అమెరికాసేనల నిష్క్రమణతో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. భారత్ సహా చాలా దేశాలు ఆ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించలేదు. అలాగే కేబినెట్ మంత్రులుగా ఎంపికైన పలువురు తాలిబన్ నేతలు ఐరాస నిషేధిత జాబితాలో ఉన్నారు.
కాగా, సార్క్ అనేది దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం. భారత్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్ ఇందులో సభ్య దేశాలు. మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 23 శాతం ఇక్కడే ఉంది. అయితే భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు సార్క్ సమావేశాలపై ప్రభావం చూపుతున్నాయి.