రంజాన్ మాసం కావడంతో పాటు సోమవారం ప్రపంచ ముస్లింలు పవిత్ర రంజాన్‌ను జరుపుకునేందుకు రెడీ అవుతున్న తరుణంలో.. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మక్కా మసీదుపై ఉగ్రమూకలు కన్నేశారు. విధ్వంసానికి ప్లాన్ వేశారు. మూడు ఉగ్రవాద బృందాలు ఈ విధ్వంసంలో పాలు పంచుకునేందుకు రెడీ అయ్యాయనని సౌదీ అరేబియా పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో, లక్షలాది మంది ప్రార్థనల్లో పాల్గొనే సమయంలో విరుచుకుపడాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. దీనిని గుర్తించిన పోలీసులు.. టెర్రరిస్టులు దాగివున్న భవనంపై దాడులకు పాల్పడ్డారు. దీనిని గుర్తించిన ఒక ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భవనం పాక్షికంగా దెబ్బతినగా, ఐదుగురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. దీంతో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. 2014 నుంచి ఐసిస్ మక్కా మసీదుపై కాల్పులు, విధ్వంసానికి ప్రయత్నిస్తూనే వుందని వారు తెలిపారు.